తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనకు బాధ్యులైన పాలకులపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. అధికారులు బాగా పని చేస్తున్నా.. సమన్వయం సక్రమంగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.
సమన్వయ లోపమే రుయా ఘటనకు కారణం: ఎంపీ రఘరామ - mp raghurama allegations on government about tirupati ruia incident
కర్నూలు, అనంతపురం జిల్లాలో ఘటనలు చూసైనా పాలకులు అప్రమత్తం కాకపోవడమే.. తిరుపతి రుయా సంఘటనకు కారణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అధికారులు సక్రమంగా పనిచేస్తున్నా.. వారి మధ్య సమన్వయ లోపమే ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు.
రుయా ఘటనపై ఎంపీ రఘరామకృష్ణమరాజు
11 మంది మృతి చెందినట్లు చిత్తూరు కలెక్టర్ అధికారికంగా వెల్లడించిన 10 నిమిషాలకే ఆ సంఖ్య 22కు పెరిగిందని చెప్పారు. ఇప్పుడు అది సుమారు 35కు చేరి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో రెండు ఘటనలు జరిగిన తర్వాత సైతం.. పాలకులు అప్రమత్తం కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: