ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా - ఎమ్మెల్యే రోజా తాజా వార్తలు

వైకాపా ఎమ్మెల్యే రోజా... తితిదే నిబంధనలు ఉల్లంఘించారు. తిరుమల కొండపైకి వచ్చిన ఆమె కారులో వైకాపా జెండా, పార్టీ నాయకుల ఫోటోలతో కూడిన కరపత్రాలు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

YCP MLA Roja violated the rules IN TIRUMALA
YCP MLA Roja violated the rules IN TIRUMALA

By

Published : Aug 3, 2020, 5:20 PM IST

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా

వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల కొండపై నిబంధనలు ఉల్లంఘించారు. పార్టీ జెండా, కరపత్రాలతో ఆమె కొండపైకి వచ్చారు.

సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో ఆమె కారులో వైకాపా జెండా, పార్టీ నాయకుల ఫోటోలతో కూడిన కరపత్రాలు ఉన్నాయి. రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి వస్తువులు కొండపైకి తీసుకురాకూడదు. నిబంధనలు అతిక్రమించారని ఎమ్మెల్యే రోజాపై విమర్శలు వస్తున్నాయి. ఆమె కారును భద్రతా సిబ్బంది తనిఖీ చేయకుండానే ఎలా అనుమతించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details