తిరుపతి ఉపఎన్నికలోనూ స్థానిక సంస్థల ఫలితాలే వస్తాయని తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అన్నారు. దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ ఉపఎన్నిక ఫలితం ఉంటుందన్నారు. లోక్‌సభ ఉపఎన్నికపై తిరుపతిలో వైకాపా నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైవీ.సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈనెల 29న వైకాపా అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేస్తారని.. 4 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తామని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
'దేశం దృష్టిని ఆకర్షించేలా తిరుపతి ఉపఎన్నిక ఫలితం'
దేశం దృష్టిని ఆకర్షించేలా తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం ఉంటుందని తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. ఉపఎన్నికపై తిరుపతిలో వైకాపా నేతలతో సమావేశం నిర్వహించారు.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక