విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై వైకాపా ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ పేరుతో నిరసనలు, పాదయాత్రలు చేస్తున్న వైకాపా... కేంద్ర ప్రభుత్వం ముందు సాగిల పడుతోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ఆరోపించారు. సంక్షేమ పథకాలపై నమ్మకం ఉంటే... ఎన్నికలను ప్రజాస్వామ్యహితంగా జరిపించాలని పేర్కొన్నారు.
'వైకాపా కేంద్ర ప్రభుత్వం ముందు సాగిల పడుతోంది' - CPI Narayana Comments on Jagan
ప్రభుత్వానికి విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో చిత్తశుద్ధి ఉంటే... అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ నేత నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా కేంద్ర ప్రభుత్వం ముందు సాగిల పడుతోందని విమర్శించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ