అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని.. తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం, జాతుల సంరక్షణ అవసరాన్ని.. విద్యార్థులకు క్యూరేటర్ హిమశైలజా వివరించారు. పిచ్చుకులే కాకుండా ఇతర పక్షుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పిచ్చుకల సంరక్షణ కోసం.. ఈ దినోత్సవాన్ని నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా... ఫ్రాన్స్‌కు చెందిన ఎకో-సిస్ యాక్షన్ ఫౌండేషన్ ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో నిర్వహిస్తోంది. అనంతరం విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించి... గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.