కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో రైల్వే శాఖ సైతం భాగస్వామ్యం అవుతోంది. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చే విధంగా రైల్వే శాఖ ప్రణాళికలు రచించింది. దేశవ్యాప్తంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న రైళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న దక్షిణ మధ్య రైల్వే... తిరుపతి రైల్వే స్టేషన్లో 60 కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు 500మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. రైల్వే సిబ్బంది, పోలీసులు పర్యవేక్షణలో ఈ పనులు సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఇవి అందులోకి రానున్నాయి.
తిరుపతి రైల్వేస్టేషన్‌లోనూ ఐసొలేషన్ కేంద్రాలు - తిరుపతి వార్తలు
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైలు కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్లోనూ ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నారు.
![తిరుపతి రైల్వేస్టేషన్‌లోనూ ఐసొలేషన్ కేంద్రాలు Work is underway to provide isolation centers at Tirupati Railway Station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6656846-92-6656846-1585988491487.jpg)
Work is underway to provide isolation centers at Tirupati Railway Station