ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి జిల్లాలో రోడ్డెక్కిన మహిళలు.. ఎందుకంటే..! - liquor shops in Tirupati

Protest to remove liquor shops: మంచినీళ్లు దొరకని ఊర్లుండొచ్చేమో గానీ.. మందు దొరకని గ్రామాలు లేవు.. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. గుడి, బడే కాదు.. ఇళ్ల మధ్య కూడా మద్యం షాపులు వెలుస్తున్నాయి. ఇంతవరకు అయితే ఓకే.. కానీ మందుబాబులకు నిషా ఎక్కిన తర్వాత ఆ ప్రాంతంలో మహిళలు తిరగాలంటేనే భయపడిపోతున్నారు. ఇన్నాళ్లు ఓపిగ్గా అన్నీ భరించిన మహిళలు ఆందోళన బాట పట్టారు. ఇళ్ల మధ్య ఉన్న మద్యం షాపు ఎత్తివేయాలంటూ రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు.

liquor shops
ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు

By

Published : Oct 11, 2022, 7:10 PM IST

AP Liquor Policy: ఇంతకాలం మందుబాబుల అఘాయిత్యాలను భరిస్తూ వచ్చారు ఆ ప్రాంతంలోని ప్రజలు. ఇక ఓపిక నశించిన ఆ ప్రాంతంలోని మహిళలు.. తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లా కె.వి.బి.పురం మండలం రాగిగుంటలో రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాగిగుంటలో మద్యం దుకాణం తొలగించాలంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం వల్ల ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లేటప్పుడు, రాత్రి సమయాల్లో మందుబాబుల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. వైన్​షాప్​ తొలగించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇళ్ల మధ్య వైన్​షాపు తొలగించాలంటూ రోడ్డుపై మహిళల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details