నెల్లూరులో సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక భాజపా-జనసేన అభ్యర్థి రత్నప్రభ తెలిపారు. తిరుపతి భాజపా కార్యాలయంలో రత్నప్రభ మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి కోసమే కాకుండా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. జనసేన మద్దతు భాజపాకు లేదన్న ప్రచారం సరికాదన్న రత్నప్రభ.. తన అభ్యర్థిత్వంపై 200 శాతం పవన్ సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పిలిస్తే ప్రచారానికి వస్తానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారని వివరించారు.
సోమవారం నామినేషన్ దాఖలు చేస్తా: రత్నప్రభ - Ratnaprabha Latest News
తిరుపతి భాజపా కార్యాలయంలో రత్నప్రభ మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. డబ్బుకు ఓటెయ్యాలో లేదా నీతి నిజాయతీకి ఓటెయ్యాలో ప్రజలు తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
రత్నప్రభ
గతంలో జగన్‌ను ప్రశంసించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రత్నప్రభ వ్యాఖ్యానించారు. మంచి పని చేస్తే ప్రశంసించా.. అంతమాత్రాన మద్దతు ఇస్తానని కాదని స్పష్టం చేశారు. డబ్బుకు ఓటెయ్యాలో లేదా నీతి నిజాయతీకి ఓటెయ్యాలో ప్రజలు తేల్చుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
Last Updated : Mar 28, 2021, 3:45 PM IST