చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర.. తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది. అనంతరం ఆ తలను సంచిలో తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
చిత్తూరు : దంపతుల మధ్య ఘర్షణ...భర్త తల నరికిన భార్య - renigunta crime c
11:58 January 20
భర్త తలతో రేణిగుంట పీఎస్‌లో లొంగిపోయిన భార్య
ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితురాలిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి వెళ్లారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఈ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి :అప్పుడు పీఆర్సీకి అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదు: మంత్రి సురేశ్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!