తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో.. శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణఘట్టాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.
తిరుపతిలో వైభవంగా.. సీతారాముల కల్యాణం - ap latest news
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామివారు హంస వాహనంలో ఊరేగారు.
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు: వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కోవెలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జగదభిరాముడు వేణుగాన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏకశిలానగరి వీధుల్లో పురుషోత్తముడి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై కొలువుదీరిన స్వామివారి ఊరేగింపు కనుల పండువగా సాగింది. 15వ తేదీ రాత్రి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయడానికి 2 లక్షల పొట్లాలు సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ ఈవో తెలిపారు.
ఇదీ చదవండి:KGF Hero: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్ "హీరో"