తిరుమలలోని అన్నప్రసాదం వితరణ కేంద్రంలో ఆయుధ పూజను తితిదే నిర్వహించింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని వేంకటేశ్వరస్వామిని, దుర్గామాతను ప్రార్థిస్తూ విజయదశమి సందర్భంగా అన్నప్రసాద భవనంలో ఆయుధపూజ నిర్వహించినట్టు ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో జరిగిన ఆయుధపూజలో అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీ ఎస్వో గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.
వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ - వెంగమాంబ అన్నప్రసాద భవనంపై వార్తలు
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ