ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రుయా'లో సమస్యల పరిష్కారానికి కృషి - "We will develop Ruia Hospital in every way"- heath secretray of state govt, jahawar reddy

రాయలసీమకే తలమానికమైన రుయా ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన...అనంతరం రుయాలో తనిఖీలు నిర్వహించారు.

'రుయా'లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తనిఖీలు

By

Published : Aug 11, 2019, 7:16 PM IST

'రుయా'లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తనిఖీలు
వసతుల లేమి, ఉద్యోగుల కొరత తదితర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి రుయా ఆసుపత్రిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి చేరుకున్న ఆయన రుయాతోపాటు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన తదితర విషయాలపై వైద్యాధికారులతో చర్చించారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచించి అమలు చేస్తామన్న జవహర్ రెడ్డి....రాయలసీమకే తలమానికమైన రుయా ఆసుపత్రిని అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details