ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hanuman birthplace: అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా నమ్ముతున్నాం: సుబ్బారెడ్డి - Tirumala Latest News

ఆకాశగంగ తీర్థంను తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి సందర్శించారు. అంజనాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుమలలోని అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా నమ్ముతున్నామని స్పష్టం చేశారు.

తితిదే ఛైర్మన్‌ వై.వీ సుబ్బారెడ్డి
తితిదే ఛైర్మన్‌ వై.వీ సుబ్బారెడ్డి

By

Published : Jun 19, 2021, 5:34 PM IST

ఆకాశగంగ తీర్థంను తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు సందర్శించారు. బాలాంజనేయస్వామి, అంజనాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వై.వి. మాట్లాడుతూ... అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా నిర్ధారించామని పునరుద్ఘాటించారు. ఆకాశగంగలో ఆలయం అభివృద్ధికి త్వరలోనే శ్రీకారం చుడుతామని తెలిపారు.

హనుమంతుని జన్మస్థలంపై నెలకొన్న వివాదంపై స్పందిస్తూ... ఇతర రాష్ట్రాలతో పోటీపడటం తమ ఉద్దేశం కాదన్నారు. తిరుమలలోని అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా నమ్ముతున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు

ABOUT THE AUTHOR

...view details