తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైదరాబాద్ ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, యువ హీరో ఆది దంపతులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శశి చిత్రం విడుదల నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు ఆది తెలిపారు.