బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. తిరుమల శ్రీవారికి ఈ రోజు ముత్యపు పందిరి వాహనసేవ వైభవంగా నిర్వహించారు. సర్వాళంకారభూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా బకాసుర వధ అలంకారంలో ముత్యపు పందిరిపై దర్శనమిచ్చారు.
కల్యాణ మండపంలో కోలువుతీర్చిన వాహన సేవలో.. నక్షత్ర, పూర్ణకుంభ హారతులను అర్చకులు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మధ్య వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. వాహన సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహన్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సినీ హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.