తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణ.. ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వాడ శ్రీనివాస్, జంగా కృష్ణమూర్తి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్మాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇతర తెదేపా నాయకులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. తెదేపా, వైకాపా, భాజపా నేతలు స్వామివారి సేవలో విడివిడిగా పాల్గొన్నారు.
vips visit Tirumala temple