తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పోన్నాడ సతీష్ కుమార్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala news
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే పోన్నాడ సతీష్ కుమార్, సినీనటుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు