ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు దర్శనం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. గాయని సునీత తన వివాహం జనవరి 9న జరగనుందని.. అందుకే స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా తదితరులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

VIPs visit Tirumala in Chittoor district
VIPs visit Tirumala in Chittoor district

By

Published : Dec 31, 2020, 11:52 AM IST

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాస్, గాయని సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు.

కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తితిదే దర్శనం కల్పించడాన్ని మంత్రి అభినందించారు. జనవరి 9వ తన వివాహం జరగనుందని తెలిపిన గాయని సునీత.. స్వామివారి ఆశీస్సుల పొందడం సంతోషంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details