ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TIRUMALA: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది: సజ్జల - deputy cm narayana swamy

VIPs to Tirumala: తిరుమల శ్రీవారిని ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సజ్జల, నారాయణ స్వామి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సజ్జల, నారాయణ స్వామి

By

Published : Feb 12, 2022, 9:55 AM IST

Updated : Feb 12, 2022, 10:12 AM IST

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది: సజ్జల

Sajjala at Tirumala: తిరుమల శ్రీవారిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది: సజ్జల

రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయిందన్నారు సజ్జల. ఆర్థికపరమైన ఇబ్బందులున్నా.. జగన్ పాలనలో రాష్ట్రం సరైన దిశలో వెళ్తోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ సకాలంలో రావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు సజ్జల తెలిపారు.

ఇదీ చదవండి:

AP CINEMA STUDIOS: ఈ ప్రాంతాల్లో సినిమా స్టూడియోలకు ప్రభుత్వం నిర్ణయం

Last Updated : Feb 12, 2022, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details