ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala programs latest news

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామివారిని దర్శించుకున్నారు.

vip's at Tirumala darshan
vip's at Tirumala darshan

By

Published : Apr 9, 2021, 12:26 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆశోక్ బాబు, భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

కరోనా వ్యాక్సిన్ కోసం 100 దేశాలు భారత్ వైపు చూడడం గర్వకారణమని లక్ష్మణ్‌ అన్నారు. జగన్‌ను విష్ణువుతో పోల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: మళ్లీ లాక్‌డౌన్‌ రానివ్వొద్దు : సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details