తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, కర్నాటక రాష్ట్ర మంత్రి ప్రభు చౌహాన్, సినీ నటి నమిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. జగన్, షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవని.. సొంత అన్నా చెళ్లెల్ల మధ్య విభేదాలున్నాయని వదంతులు సృష్టించవద్దని అన్నారు. జగన్‌కు ఆంధ్ర, తెలంగాణ వేరు కాదని.. కేసీఆర్ అంటే అభిమానం ఉందని తెలిపారు.
త్వరలో నమితా థియేటర్ అనే ఓటీటీని, నమిత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభిస్తామని నమిత దంపతులు ప్రకటించారు. గతంలో శ్రీవారిని దర్శనం సంతృప్తికరంగా ఉండేదని.. ప్రస్తుతం ఆలయంలోని ఉద్యోగుల్లో కరోనా భయం కనపడుతోందన్నారు. కాగా.. శుక్రవారం శ్రీవారిని 14,229మంది భక్తులు దర్శించుకున్నారు. 7,176 మంది తలనీలాలా సమర్పించారు. శ్రీవారికి రూ.1.93కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.