రాష్ట్ర ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఇళ్లు, దేవాలయాలకు పరిమితం చేయాలని వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ తీర్మానించింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమిషనర్, ఎస్పీలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
వినాయక చవితి వేడుకలపై చర్చించిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు, అధికారులు... ఉత్సవాలను ఈ సారి బహిరంగంగా నిర్వహించకూడదంటూ తీర్మానం చేశారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా వినాయక చవితి పండుగను ఇళ్లకు, దేవాలయాలకు పరిమితం చేసి ప్రజలు సహకరించాలని కోరారు.