అక్టోబరు 27 నుంచి నవంబరు 2 వరకు తితిదేలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు తితిదే సంస్థల్లో విజిలెన్స్ వారోత్సవాలు జరగనున్నాయి. అక్టోబరు 31న సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అవినీతి నిర్మూలన, దేశ సమగ్రత, నిఘా అంశాల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు సీవీసీ ఆదేశాలకు అనుగుణంగా విజిలెన్స్ వారోత్సవాలను తితిదే నిర్వహిస్తోంది.
నేటి నుంచి తితిదేలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు - తితిదేపై వార్తలు
నేటి నుంచి తితిదేలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరగనున్నాయి. తితిదే పరిపాలన భవనంలో అన్ని విభాగాల ఆధిపతులు, ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా, సంస్థ పట్ల నిబద్ధత కలిగి భక్తులకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేయించనున్నారు.

తితిదే పరిపాలన భవనంలో అన్ని విభాగాల ఆధిపతులు, ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా, సంస్థ పట్ల నిబద్ధత కలిగి భక్తులకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేయించనున్నారు. నవంబరు 2 వరకు తితిదే అన్ని విభాగాల ఉద్యోగులు, తిరుమలలో యాత్రికులు, ట్యాక్సీ డ్రైవర్లు, దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుమల, తిరుపతిలోని తితిదే సంస్థల వద్ద, ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. తితిదే నిఘా, ముఖ్య భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి పర్యవేక్షణలో విజిలెన్స్ వారోత్సవాలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం