ఈ నెల 4, 5 తేదీల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్(ఏఎస్ఎల్)ను నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ హరినారాయణ... విమానాశ్రయ అధికారులు, ఇతర శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఏర్పేడు ఐఐటీ, తిరుపతిలోని అమరరాజా హాస్పిటల్, తిరుమల వరకు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్)ను ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు స్పెషల్ పోలీస్ టీం వారు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఈ నెల 4న చిత్తూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటన
ఈ నెల 4,5 తేదీల్లో ఉపరాష్ట్రపతి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేయటంతో పాటు స్పెషల్ టీం వారు తనిఖీలు చేపట్టారు.
vice president tour in chittoor