లాక్డౌన్ ప్రభావం మూగజీవాలపైనా కనిపిస్తోంది. తిరుపతిలో చాలా వరకూ రహదారుల్లో మూగజీవాలు ఆహారం దొరక్క దీనావస్థను అనుభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకు వస్తున్నారు. ఆకలితో ఉన్న నిరుపేదలకు ఆహారం అందిచటంతో పాటు మూగజీవాల ఆకలినీ తీరుస్తున్నారు. తిరుపతిలోని అలిపిరిలో సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో మూగజీవాలకు కాయగూరలను ఆహారంగా అందించారు. టమాటాలు, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్లతో వాటి ఆకలి తీర్చారు. నిరుపేదలను ఆదుకోవటంతో పాటు పశుసంపదను కాపాడుకోవటంపైనా దాతలు దృష్టి పెట్టాలని వారు కోరారు.
మంచి మనుషులు... మూగజీవాల కడుపు నింపారు
కరోనాపై పోరులో భాగంగా లాక్డౌన్ విధించటంతో నిరుపేదలతో పాటు మూగజీవాలు సైతం ఆహారం లేక అలమటిస్తున్నాయి. కొంతమంది గొప్ప మనసుతో వాటి బాధను అర్థం చేసుకుని ఆకలి తీరుస్తున్నారు. ఇవాళ అలిపిరిలో మూగజీవాల కడుపు నింపారు సిటీ ఛాంబర్ సభ్యులు.
Vegetables fed to the animals in alipiri by siti chamber