తిరుమలలలో ఈ నెల 22వ తేదీన కార్తీక వనభోజన మహోత్సవాన్ని తితిదే నిర్వహించనుంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వనభోజనోత్సవంలో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు మరో పల్లకీపై ఆలయం నుంచి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేస్తారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం, అభిషేకాలను నిర్వహిసారు. అనంతరం అటవీ ప్రాంతంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. స్థానికులకు, యాత్రికులకు సామూహికంగా అన్నప్రసాదాలను వడ్డిస్తారు.
కార్తిక వనభోజనం కారణంగా ఆ రోజు శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను తితిదే రద్దు చేసింది.