దేశం కోసం ప్రాణాలర్పించిన సైనిక కుటుంబాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోని కరోనా టీకా కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కపిలతీర్థం సమీపంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు.
అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించారు. దేశంపై దాడి చేసేందుకు కొన్ని దేశాలు చూస్తున్నాయని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనిక కుటుంబాల సంక్షేమం కోసం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మరింత చేయూత అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.