శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవకు అలంకరించే గోడుగులు చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు చేరుకున్నాయి. హిందూ ధర్మార్థ సమితి ఆద్వర్యంలో వాహన సేవలల్లో అలంకరించే గొడుగులను ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో తితిదేకు అందిస్తారు. ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న 11 గొడుగులను తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి అందించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించే ప్రధాన వాహనసేవైన గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.
తిరుమలకు చేరుకున్న 'గరుడసేవ' గొడుగులు - తితిదే తాజా వార్తలు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవకు అలంకరించే గోడుగులు చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు చేరుకున్నాయి. హిందూ ధర్మార్థ సమితి ఆద్వర్యంలో వాహన సేవలల్లో అలంకరించే గొడుగులను ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో తితిదేకు అందిస్తారు.
తిరుమలకు చేరుకున్న గరుడసేవకు ఉపయోగించే గొడుగులు