తిరుపతి నగరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. నగరంలోని కొర్లగుంట కూడలిలో ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. దుర్భాషలాడుతూ రోడ్డుపై కర్రలతో రక్తం వచ్చేలా దాడి చేశారు. పక్కనే ఉన్న దుకాణదారుడు యువకులను వారించే ప్రయత్నం చేశారు. రక్తం కారుతోంది.. దాడి చేయోద్దంటూ నచ్చ చెప్పేందుకు యత్నించాడు. అలా చెప్పిన వ్యక్తిపై సైతం దౌర్జన్యానికి దిగారు. ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పెట్టటంతో దాడి దృశ్యాలు వైరల్ అయ్యాయి.
వైరల్ వీడియో: మద్యం మత్తులో వ్యక్తిపై యువకులు దాడి - తిరుపతిలో యువకులు దాడి వైరల్ అవుతున్న వీడియో వార్తలు
మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. దాడి చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పెట్టటంతో వైరల్ అయ్యాయి.
మద్యం మత్తులో వ్యక్తిపై యువకులు దాడి
ఇవీ చూడండి...