ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల కొండపై రెండు పాములు.. భయాందోళనలో భక్తులు - తిరుమలలో పాముల కలకలం

తిరుమలలో రోజురోజుకు పాముల సంచారం ఎక్కువవుతోంది. కొండపై వేర్వేరు ప్రదేశాల్లో రెండు పాములు కనిపించటంతో.. భక్తులు భయాందోళనకు గురయ్యారు. భద్రతా సిబ్బంది వాటిని అడవిలో వదిలిపెట్టారు.

two snakes found at tirumala
తిరుమల కొండపై రెండు పాములు.. భయాందోళలో భక్తులు

By

Published : Mar 16, 2021, 3:51 PM IST

Updated : Mar 17, 2021, 9:27 AM IST

తిరుమల కొండపై రెండు పాములు.. భయాందోళలో భక్తులు

తిరుమలలో మంగళవారం రెండు చోట్ల పాములు కలకలం రేపాయి. స్వామివారి ఆలయ సమీపంలోని కల్యాణవేదిక వద్ద నాగపాము ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది.. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడుకు సమాచారమిచ్చారు.

ఆయన వచ్చి చాకచక్యంగా పట్టుకున్నారు. మ్యూజియం సమీపంలో మరో జెర్రిపోతు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి దాన్నీ బంధించారు. పట్టుకున్న పాములను శేషాచలం అటవీ ప్రాంతంలోని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.

Last Updated : Mar 17, 2021, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details