చిత్తూరు జిల్లా తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో వీరయ్య, కుమారస్వామి అనే ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన వీరు భోజనానంతరం విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వాంతులు రావడంతో.. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. ఫలితాల అనంతరం మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహిస్తారని... అప్పుడే వీరి మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
ఇద్దరా.. నలుగురా..?