ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Murder: పొలాల మధ్యలో యువకుల మృతదేహాలు.. ఎవరు చంపారు? - Two persons were killed and dumped

Two persons were killed and dumped తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల పరిధిలోని.. రాచకండ్రిగలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. రాచకండ్రిగ చెరువు వద్ద ఓ మృతదేహం, శబరి స్పిన్నింగ్ మిల్ సమీపంలోని.. పొలాల వద్ద మరో మృతదేహం పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

Two persons were killed and dumped
పొలాల మధ్యలో యువకుల మృతదేహాలు.. ఎవరు చంపారు?

By

Published : Sep 6, 2022, 11:33 AM IST

Updated : Sep 6, 2022, 11:42 AM IST

killed and dumped in a field: తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లం పంచాయతీ రాచకండ్రిగ సమీపంలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. మృతులను తడకు చెందిన రెహమాన్‌ (28), ప్రేమ్‌ అలియాస్‌ ప్రియాంక (30)గా గుర్తించారు. ఈ ఇద్దరు స్నేహితులను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపి రాచకండ్రిగ చెరువు వద్ద రెహమాన్‌ మృతదేహాన్ని, కొంచెం దూరంలో పొలాల్లో ప్రేమ్‌ మృతదేహాన్ని పడవేశారు. సోమవారం సాయంత్రం పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ప్రేమ్‌, రెహమాన్‌లు హత్యాయత్నం, దారిదోపిడీ వంటి పలు కేసుల్లో నిందితులు. రెహమాన్‌ గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నాడు. ప్రతిరోజూ రాత్రి వేళల్లో మద్యం తాగేందుకు ప్రస్తుతం హత్యకు గురైన స్థలం రాచకండ్రిగ చెరువు వద్దకు వచ్చేవారని స్థానికులు తెలిపారు. వారి బాధితులు గానీ, గంజాయి లావాదేవీల్లో ఏర్పడిన వివాదాలు బెడిసి గంజాయి ముఠా సభ్యులుగానీ హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పొలాల మధ్యలో యువకుల మృతదేహాలు.. ఎవరు చంపారు?
Last Updated : Sep 6, 2022, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details