తెలుగుగంగ కాలువలో అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శీతల, రాజకుమార్‌లు తంగేళ్లపాళెం సమీపంలోని ఓ ఇటుక బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు ఇద్దరు పిల్లలు సెంటు(18), పప్పు(16)లు ఇటీవల ఇక్కడకు వచ్చారు. వారు ఉన్న ప్రాంతానికి సమీపంలో.. తెలుగు గంగ కాలువ ప్రవహిస్తుండటంతో అన్నదమ్ములిద్దరూ సరదాగా ఈతకు దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినా.. జాడ కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు గంగ కాలువలో... ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు - తెలుగు గంగ కాలువలో యువకులు గల్లంతు
ఈతకు వెళ్లి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని తెలుగు గంగ కాలువలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నదమ్ములు గల్లంతు