ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Arrest: అధిక ధరలకు శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లు..ఇద్దరు అరెస్టు - తిరుమలలో దళారుల అరెస్టు

తిరుమలలో వీఐపీ దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయించిన ఇద్దరు దళారులను తితిదే విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు భక్తులకు రూ. 18 వేలు, 21 వేల చొప్పున దళారులు టికెట్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు.

Two agents arrested at tirumala over sell Srivari VIP darshan tickets high prices
అధిక ధరలకు శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లు

By

Published : Jul 10, 2021, 9:32 PM IST

తిరుమలలో వీఐపీ దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయించిన ఇద్దరు దళారులను తితిదే విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన భక్తుడికి రూ. 18 వేలకు, సూర్యాపేటకు చెందిన మరో భక్తుడికి రూ. 21 వేలకు టికెట్లు దళారులు విక్రయించినట్లు గుర్తించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లో టికెట్లు తనిఖీ చేస్తుండగా..దళారుల బండారం బయటపడింది. టికెట్ల తనిఖీల్లో భక్తుల నుంచి దళారుల వివరాలు తెలుసుకొని వారిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details