ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒకే వేదికపై... 30కి పైగా కవలల జంటలు - తిరుపతిలో కవలల దినోత్సవం

సాధారణంగా ఒకే పోలికలతో ఉన్న కవల జంట కనిపిస్తేనే ఆశ్చర్యంగా చూస్తుంటాం. అలాంటిది ఏకంగా 30కి పైగా కవలల జంటలు ఒకే వేదికపై చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఇందుకు వేదికైంది.

TWINS_DAY_CELEBRATIONS_IN_TIRUPATI
TWINS_DAY_CELEBRATIONS_IN_TIRUPATI

By

Published : Feb 20, 2020, 8:51 PM IST

ఒకే వేదికపై... 30కి పైగా కవలల జంటలు

అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి కరకంబాడి రోడ్డులోని స్ప్రింగ్ డేల్ పబ్లిక్ స్కూల్​లో​ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఆ పాఠశాల సిబ్బంది విద్యనభ్యసిస్తోన్న కవలలందరినీ ఒకే చోటకు చేర్చారు. 30కి పైగా కవల జంటలు ఒకే రకమైన దుస్తులు ధరించి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ ఇంత మంది కవలలు తమ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించడం విశేషమని అన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details