ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జనవరి 5న తిరుపతి ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన' - తులసిరెడ్డి న్యూస్

జనవరి 5న తిరుపతి లోక్​సభ ఉపఎన్నికు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఉపఎన్నికపై ఆరుగురు సభ్యుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

'జనవరి 5న తిరుపతి ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన'
'జనవరి 5న తిరుపతి ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన'

By

Published : Dec 19, 2020, 8:49 PM IST

తిరుపతి లోక్​సభ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జనవరి 5న ప్రకటించనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఆరుగురు సభ్యుల బృందంతో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జనవరి 5న జరిగే రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పోటీ చేయబోయే అభ్యర్థిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

ఎన్నికకు సంబంధించి పార్టీ ప్రణాళికలను ఆయన వివరించారు. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీల విషయంలో భాజపా నియంతృత్వ పోకడలను, హక్కులను సాధించుకోవటంలో తెదేపా, వైకాపాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యపరుస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details