ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అప్పుడు రత్నాలను రాసులుగా పోస్తే..ఇప్పుడు ఇసుకను పోస్తున్నారు' - వైకాపా ప్రభుత్వంపై తులసిరెడ్డి కామెంట్స్

శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మితే...జగన్ ప్రభుత్వంలో ఇసుక రాసులుగా పోసి అమ్ముతున్నారని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి దుయ్యబట్టారు. తేలు, మండ్రగబ్బ పాత్ర పోషిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం వచ్చేలా తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

tulasirddy fire on ycp govt
అప్పుడు రత్నాలను రాసులుగా పోస్తే..ఇప్పుడు ఇసుకను పోస్తున్నారు

By

Published : Apr 10, 2021, 8:10 PM IST

కేంద్రంలోని భాజపా.. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు తేలు, మండ్రగబ్బ పాత్రను పోషిస్తున్నాయని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్​కు మద్దతుగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రచారం నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మితే...జగన్ ప్రభుత్వంలో ఇసుక రాసులను అమ్ముతున్నారని దుయ్యబట్టారు. తేలు, మండ్రగబ్బ పాత్ర పోషిస్తున్న పార్టీలకు గుణపాఠం వచ్చేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి భాజపా శని గ్రహం, తెదేపా, వైకాపాలు రాహు, కేతువుల వలే దాపురించాయని విమర్శించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం పరిశ్రమ, రామాయపట్నం, దుగరాజుపట్నం పోర్టులు కాంగ్రెస్​తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తాజా లడ్డూలుగా ఎలా మారాయో సినిమా రూపంలో తెలియజేయాలని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details