ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుడా ఛైర్మన్​గా చెవిరెడ్డి బాధ్యతల స్వీకరణ

తిరుపతి అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్​గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తిరుపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

తుడా చైర్మన్​గా చెవిరెడ్డి బాధ్యతల స్వీకరణ

By

Published : Jun 16, 2019, 10:01 AM IST

తిరుపతి పట్టణాన్ని అవినీతిరహిత పట్టణంగా తీర్చి దిద్దుతానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తుడా ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన... తిరుపతిలో పాలనను ప్రజలకు చేరువ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. తుడా పరిధిలోని అన్ని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత భాస్కర్ రెడ్డి మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

తుడా చైర్మన్​గా చెవిరెడ్డి బాధ్యతల స్వీకరణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details