ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అవిలాల చెరువును 3 నెలల్లో అభివృద్ధి చేస్తాం' - తిరుపతి అభివృద్ధిపై తుడా ఛైర్మన్ కామెంట్స్

తిరుపతిలోని అవిలాల చెరువును మూడు నెలల్లో అభివృద్ధి చేయాలనే ప్రణాళికలతో కృషి చేస్తున్నట్లు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ.. తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు.

'అవిలాల చెరువును మూడు నెలల్లో అభివృద్ధి చేస్తాం'
'అవిలాల చెరువును మూడు నెలల్లో అభివృద్ధి చేస్తాం'

By

Published : Oct 18, 2020, 6:38 PM IST

తుడా కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. పలు రాజకీయ పార్టీల నుంచి అభివృద్ధి పనుల కోసం తుడా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. తిరుపతి కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ హబ్ ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

సువర్ణముఖీ నదీ తీరం వెంబడి పార్కుల అభివృద్ధి, విశ్రాంత ఉద్యోగుల కోసం విశ్రాంతి గదులను త్వరలో నిర్మించినున్నట్లు వెల్లడించారు. అవిలాల చెరువును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మూడు నెలల్లో ప్రగతి పనులను పూర్తి చేసే విధంగా ప్రణాళికలను చేస్తున్నట్లు తుడా ఛైర్మన్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details