ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తితిదే ఈవో - tirumala tirupati devastanam latest news

తితిదే ఈవోగా పనిచేసే అవకాశం రావటం తన అదృష్టమని కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు. శనివారం పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన... అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ttd eo jawahar
ttd eo jawahar

By

Published : Oct 10, 2020, 7:53 PM IST

తితిదే నూతన ఈవో కేఎస్ జవహర్ రెడ్డి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈవోగా శ్రీవారి ఆలయంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ఆయన... అనంతరం కుటుంబ సమేతంగా తిరుచానూరు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

నూతన ఈవోకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తితిదే జేఈవో బసంత్ కుమార్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియా మాట్లాడిన జవహర్ రెడ్డి... తితిదే ఈవోగా పనిచేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details