ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. - తిరుమలలో ఉగాది వేడుకలు

ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 13న స్వామి వారి సాధారణ సేవలు రద్దు చేశారు. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది.

TTD
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది

By

Published : Apr 11, 2021, 12:34 PM IST

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్లవ నామ సంవత్సర ఉగాది ఆస్థానంను నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది. ఆ రోజున తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి.. అనంతరం శుద్ది చేయనున్నారు. ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేయనున్నారు. ఆ తరువాత 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి వేంచేయనున్నారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేసి పంచాగ శ్రవణం చేయనున్నారు. ఉగాది ఆస్థానం కారణంగా ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ‌ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఇతర కార్యక్రమాలను తితిదే రద్దు చేసింది.

ABOUT THE AUTHOR

...view details