తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. రేపు మాఘపూర్ణిమను పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో మూడు నదుల సంగమ స్థానమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం చేయించనున్నారు.
తెలంగాణ: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మాఘపూర్ణిమ పుణ్యస్నానం - kaleswaram news
రేపు తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం చేయించునున్నారు.
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మాఘపూర్ణిమ పుణ్యస్నానం