అంజనీ పుత్రుడి జన్మస్థలంపై జరుగుతున్న చర్చను.. తిరుమల తిరుపతి దేవస్థానం మరింత ముందుకు తీసుకుపోనుంది. తిరుమల సప్తగిరుల్లోని అంజనాద్రే.. ఆంజనేయుడి జన్మస్థలమని ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చిన తితిదే.. ఈ విషయమై వెబినార్ (TTD Webinar) నిర్వహణకు సిద్ధమైంది.
ఈ నెల 30, 31 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తితిదే ప్రకటించింది. వెబినార్‌లో మఠాధిపతులు, వివిధ వర్సిటీల పరిశోధకులు పాల్గొననున్నారు. వెబినార్‌లో హనుమ జన్మస్థలం ప్రామాణికతపై చర్చ జరగనుంది. తిరుమలతో(tirumala) అంజనేయునికి ఉన్న పురాణ సంబంధాలపై ఈ వెబినార్‌లో మాట్లాడనున్నారు.