తితిదే పరిధిలో 49 ఆలయాలు ఉండగా... ఆన్ని ఆలయాలలో భద్రత కట్టుదిట్ట చేయడంతో పాటు బంగారు, చెక్క రథాలు ఉన్న 20 ఆలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పేర్యవేక్షించాలా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 676 ఆలయాలు ఉన్నాయని... ఆన్ని ఆలయాలలో భద్రత పెంచినట్లు ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి పర్యటన, ఇతర ప్రముఖుల పర్యటనలు ఉంటాయని... పటిష్ట భద్రతా చర్యలు చేపడుతామని తితిదే ముఖ్యనిఘా భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి తెలిపారు.
ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల చర్చ - తిరుమల బ్రహ్మోత్సవాలు న్యూస్
తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే విజిలెన్స్ అధికారులు, పోలీసుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 27వ తారీఖు వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతో తితిదే ఆలయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు.
ttd vigilence officers meeting about brahmostavalu