తితిదేలో విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను ఈవో జవహర్ రెడ్డి ప్రారంభించారు. నవంబర్ 2 వరకg జరగనున్న విజిలెన్స్ వారోత్సవాల్లో తితిదే ఉద్యోగులతోపాటు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను భాగస్వామ్యం చేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈవో ప్రకటించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులతో ఈవో ప్రతిజ్ఞ చేయించారు. భక్తులకు సేవలందించటంలో అవినీతికి పాల్పడకుండా పారదర్శకతతో విధులు నిర్వహిస్తామని ప్రమాణం చేయించారు. తిరుమలలో బస మొదలు, దర్శనానంతరం లడ్డూ ప్రసాదాల కొనుగోలు వరకూ వివిధ ప్రాంతాల్లో అవినీతిరహితంగా సేవలందించాలని ఉద్యోగులను సీవీఎస్వో గోపీనాథ్ జెట్టీ కోరారు.
తితిదే విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం - తితిదే విజిలెన్స్ వారోత్సవాలు
తితిదేలో విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను ఆలయ ఈవో జవహర్ రెడ్డి ప్రారంభించారు. భక్తులకు సేవలందించటంలో అవినీతికి పాల్పడకుండా పారదర్శకతతో విధులు నిర్వహిస్తామని ప్రమాణం చేయించారు. అవినీతిరహితంగా సేవలందించాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.

ttd vigilance awareness week