Tirumala special darshans: కొవిడ్ కారణంగా తిరుమలలో 2020 మార్చి నుంచి నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను.. తితిదే త్వరలోనే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు తితిదే వెబ్‌సైట్‌లో బార్‌కోడ్ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు. ఈ కేటగిరీలో రోజుకు వెయ్యి చొప్పున టోకెన్లు ఇవ్వనున్నారు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో రోజూ వేయి మందిని దర్శనానికి అనుమతిస్తారు. టోకెన్లను ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేసేదీ తితిదే త్వరలో వెల్లడించనుంది.
Tirumala: త్వరలో వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు - వృద్ధులు, వికలాంగులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలు
Tirumala special darshans: కొవిడ్ కారణంగా తిరుమలలో నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను.. తితిదే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు తితిదే వెబ్‌సైట్‌లో బార్‌కోడ్ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు.
త్వరలో వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు