నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. అధికారులు.. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ నెల టికెట్లను విడుదల చేస్తారు. కాగా.. నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది.
నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల - తిరుమల శ్రీవారి టికెట్ల వార్తలు
తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టికెట్లను తితిదే ఇవాళ విడుదల చేయనుంది. టికెట్లను ఆన్‌లైన్ ద్వారా అధికారులు విడుదల చేస్తారు.
tirumala tickets
సర్వదర్శనం 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నవంబరు నెలకు ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీలను తితిదే ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు, 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది.
ఇదీ చదవండి: contract professors: కొలువులేమో ఒప్పందం.. సమస్యలే శాశ్వతం.. అమలు కాని కనీస టైంస్కేలు
Last Updated : Oct 23, 2021, 7:36 AM IST