TTD Suspended three employees : తితిదేలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను నిబంధనల పేరుతో అధికారులు సస్పెండ్ చేశారు. తితిదేలో పనిచేస్తున్న ఏడు వేల మంది ఒప్పంద కార్మికులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో విలీనం చేయాలంటూ గడిచిన వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ముందు ఆందోళన చేస్తున్న కార్మికులకు తితిదే ఉద్యోగులు గుణశేఖర్, నాగార్జున, వెంకటేష్ మద్దతు ప్రకటించారు. సంఘీభావం తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు.
TTD Suspended three employees: ముగ్గురు తితిదే ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు - ap news
TTD Suspended three employees : ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారన్న కారణంతో...తితిదే ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. గుణశేఖర్, వెంకటేశ్, నాగార్జునను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారంలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన తితిదే
నవంబర్ 29న కార్మికుల నిరసన దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు ముగ్గురికి ఈ నెల ఒకటిన షోకాజ్ నోటీసు జారీ చేశారు. తితిదేలో నిరసనలు, ఆందోళనలు నిషేదం అమలులో ఉన్నా నిబంధనలు అతిక్రమిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనడంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. షోకాజ్ జారీ చేసిన మరుసటి రోజు వివరణ తీసుకోకుండానే ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ తితిదే అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి..
Last Updated : Dec 3, 2021, 3:40 AM IST