గోవిందమాల పుస్తకాల పంపిణీని తితిదే అధికారులు అడ్టుకోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం చాటేలా రూపొందించిన గోవింద మాల అనే పుస్తకాలను యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేయడానికి కొందరు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇంతలో తితిదే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని పుస్తకాలను పంచడాన్ని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా పంచకూడదని అదేశించారు... శ్రీవారి పై భక్తిని పెంచేలా చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. హిందూ దేవాలయంలో హిందూ మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ లేదంటూ ఆవేదన చెందారు.
పుస్తక పంపిణీని అడ్డుకున్న తితిదే సిబ్బంది... భక్తుల అసంతృప్తి - తిరుమల పుస్తక పంపిణీ సమచారం
తిరుమలలో గోవింద మాల పుస్తకాలు పంచడాన్ని తితిదే సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై భక్తుల ఆవేదన వ్యక్తం చేశారు.
పుస్తక పంపిణీని అడ్డుకున్న తితిదే సిబ్బంది