తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల జరిగే రోజులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. దీంతో సాధారణ రోజుల మాదిరిగానే ఉత్సవాల సమయంలో కూడా భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించనున్నారు.
తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. ఈ క్రమంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది.

ttd special entrance tickets released